ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంత సేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది.
"చీమ చీమ ఎందుకు అంత వేగంగా పరుగెత్తుతున్నన్నావు?"అని చీమను అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది. నాకన్నా చాలా పెద్దది.. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను"అంది.. చీమ.. అయితే అది నన్ను కూడా తినేస్తుందో ఏమో నేను నీతో పాటే పరిగెత్తాను. అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరుగెత్తుతుండగా కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు. అని అడిగింది కుందేలు.. అక్కడ ఒక పెద్ద జంతువు నాకన్నా చాలా పెద్దది.. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాము. అంది చీమ.. అవును అవును అంది ఎలుక.. దాంతో భయంతో కుందేలు కూడా వాటితోపాటు పరుగు లంకించింది.


 కొంతదూరం వెళ్లగా వారికి ఒక నక్క ఎదురొచ్చి మీరు అంతా ఎందుకు అంతలా పరిగెడుతున్నారు..? అంటూ ప్రశ్న వేసింది. చీమ మళ్లీ అదే సమాధానం చెప్పింది. వాటితోపాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తేక నక్క అలసటతో.. ఇంకా నావల్ల కాదు.. నేను పరిగెత్త లేను.. ఇంతకూ మనల్ని వెంబడిస్తున్న  ఆ జంతువు ఏమిటో చెప్పండి అని అడిగింది. అదే అతి పెద్ద గండు చీమ.. నా వైపే వస్తుంటే నన్నేమీ చేస్తుందో అని  భయపడి పరిగెత్తడం మొదలు పెట్టాను అని చెప్పింది చీమ.. ఇక చీమ మాటలు విన్న  ఎలుక, కుందేలు, నక్కకు ఎక్కడలేని కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా..? అనవసరంగా భయపెట్టావు.. అని కన్నెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందని అన్నానా అంది చీమ.. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు ,నక్క..కాబట్టి  ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం.


ఏది ఏమైనా నిజానిజాలు తెలుసుకోకుండా ప్రవర్తించడం తప్పు.. తెలివి తక్కువ వాళ్లే ఇలా మాట్లాడుతారు అని అని ఒక నానుడి కూడా ఉంది. కాబట్టి  ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: