ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవి కాలం రావడంతో అడవిలోని చెరువులు , నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల ఎండమావులు మెరుస్తూ కనిపించాయి.
వాటిని నీటిగా భావించి కోతులు మూకుమ్మడిగా అటువైపు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు లేవు. సరి కదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి.

దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి.
నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది. దీనంగా అంది ఒక కోతి..
ఏం చేద్దాం.. నీళ్లు కనబడుతున్నాయి .. కానీ చేతికి అందడం లేదు.ఇదేమీ మాయో... అంది మరొక కోతి.. పొదలో ఒక కుందేలు నివాసం ఉంటోంది. ఆ కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది. ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా?. దగ్గర్లో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్లి మీ దాహం తీర్చు కోండి. అని చెప్పింది.


 ఇది విని కోతులకు చాలా కోపం వచ్చింది.
"మేం తెలివితక్కువ వాళ్ళమా?"అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం.. నా మాటలు నమ్మండి. భయంగా అరిచింది కుందేలు.. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది. అందుకే మూర్ఖులకు హితువు చెబితే దాని పరిణామం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఆచితూచి ముందడుగు వేయడం తప్పని సరి లేదంటే ఇలాంటి అనర్థాలను ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెప్పిన మాట వినకపోతే మనకే ఇబ్బంది కలిగే ప్రమాదం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: