భారత స్పిన్నర్స్ కాలం కలిసొచ్చింది..శ్రీలంకలో ముగిసిన టి20  సిరీస్‌లో రాణించిన భారత స్పిన్నర్లు  యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు తాజా ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లిస్ట్ లోకి వెళ్లిపోయారు.. గతంలో ఐసీసీ  ప్రకటించిన టి20 బౌలర్ల ర్యాంకుల్లో చాహల్ రెండంకెల స్థానంలో ఉన్న చాహల్ ఇప్పుడు ఏకంగా 12 స్థానాలని దాటుకుంటూ వెళ్లి 2 వ ర్యాంకులో నిలిచాడు..అయితే వాషింగ్టన్ సుందర్ 151వ ర్యాంక్ నుంచి 31వ ర్యాంక్‌లో నిలిచాడు.

 Image result for chahal bowler

అయితే ఈ సీరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న సుందర్ 496 ఐసీసీ పాయింట్లు సంపాదించగా,  చాహల్ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 706 పాయింట్లు సంపాదించి తొలి సారి రెండో స్థానానికి చేరుకున్నాడు...బంగ్లా బౌలర్ రూబెల్ హుస్సేన  40 స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకోగా..మళ్ళీ భారత బౌలర్ ఉనద్కత్  26 స్థానాలు మెరుగుపరుచుకుని 52వ స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరు బౌలర్లు ఆదివారం ముగిసిన ట్రై  సిరీస్‌లో ఏడు వికెట్లు పడగొట్టారు.

 Image result for dinesh karthik

ఇదిలాఉంటే శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా 204 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఐసీసీ ర్యాంకుల్లో 20వ స్థానంలో నిలిచాడు..ఇదిలాఉంటే  ఆల్ రౌండర్ల జాబితాలో  బంగ్లాదేశ్‌కు చెందిన  షకిబుల్ హసన్ ఒక  ర్యాంక్ దిగజారి  మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా ఒక ర్యాంక్ ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు...ట్రై సీరీస్ లో చివరి మ్యాచ్ లో ఎంతో ఉత్కంగా జరిగిన పోరులో ఒక్క సిక్స్ తో భారత్ కి విజయం అందించిన కార్తీక్ గతంలో ఉన్న 125 ర్యాంక్ నుంచీ 95 ర్యాంక్ కి చేరుకున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: