ఇటీవల కాలంలో భారత మహిళా క్రికెటర్ లు పురుషుల క్రికెట్కు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శన తో ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను కూడా కొల్లగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవలి కాలంలో మహిళా క్రికెటర్లు సాధిస్తున్న రికార్డులు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు చూపు ఆకర్షిస్తున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా మిథాలీ రాజ్ సారథ్యంలోని టీమిండియా మహిళల జట్టు ఎంతో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. ఇక మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై విజయం సాధించింది.


 ఇకపోతే ఇటీవలే వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది టీమిండియా. ఇక ఇదే మ్యాచ్లో టీమిండియా పేసర్ ఝాలన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు 40 సాధించిన బౌలర్గా రికార్డు క్రియేట్ చేసింది. వెస్టిండీస్ బ్యాటరీ అనీష మహమ్మద్ ను హౌఔట్ చేయడం ద్వారా ఝాలన్ గోస్వామి ఇక ఈ అరుదైన ఘనత సాధించడం గమనార్హం.  ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్ స్టాన్ 39 వికెట్ల రికార్డును అధిగమించింది  గొస్వామి. ఇలా వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన క్రికెటర్ గా టాప్ ప్లేస్ లోకి దూసుకుపోయింది.


 దీంతో భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా జులన్ గోస్వామి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు వరకు ఐదు ప్రపంచ కప్ లు ఆడిన ఝాలన్ గోస్వామి వన్డే ఫార్మాట్లోనూ 198 మ్యాచ్ లలో 249 వికెట్లు పడగొట్టింది. ఇక పోతే మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా మహిళల జట్టు. ఓపెనర్ స్మృతి మందాన ఏకంగా సెంచరీతో మెరిసింది. హర్మన్ ప్రీత్ కౌర్ సైతం సెంచరీ కొట్టడం గమనార్హం. ఇక ఇద్దరు బ్యాటర్లు సెంచరీతో ఇండియా భారీ స్కోరు చేసింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బౌలర్లు పట్టు బిగించడంతో చివరికి వెస్టిండీస్పై టీమిండియా విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: