బీసీసీఐ  ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 సార్లు ప్లేఆఫ్ కి అర్హత సాధించింది. అంతేకాదు ఐపీఎల్లో ఎక్కువ సార్లు ఫైనల్ ఆడిన జట్టుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డును సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల జరిగిన  మెగా వేలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లను కొనుగోలు చేసింది చెన్నై జట్టు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా మార్చి 26వ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలబడ పోతుంది. చెన్నై కొనుగోలు చేసిన యువ ఆటగాళ్ల లిస్టు ఏంటో తెలుసుకుందాం.


 శివమ్ దూబే : ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి మరీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పోటీపడి మరీ ఇతన్ని సొంతం చేసుకుంది. ఇక తన దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తూ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇది గత ఏడాది రాజస్థాన్ తరఫున ఆడిన శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్  తో జరిగిన మ్యాచ్ లు  42 బంతుల్లో 64 పరుగులు చేసి ధోనీసేనకు చెమటలు పట్టించాడు.


 ఆడం మిల్నే   : ఇతన్ని 1.9 కోట్ల రూపాయలు చెల్లించి  చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ ప్లేయర్ గత ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇండియన్స్ తరఫున  చెన్నై సూపర్ కింగ్స్ తో ఎన్నో సార్లు తలబడ్డారు ఇప్పుడు అదే చెన్నై సూపర్ కింగ్స్ తో ఉన్నాడు.


 క్రిస్ జోర్దాన్ : మెగా వేలంలో  చెన్నై సూపర్ కింగ్స్ 3.6 కోట్లు వెచ్చించి క్రిస్ జోర్దాన్ ను సొంతం చేసుకుంది. అయితే గత సీజన్లో జోర్డాన్ పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఇక చెన్నైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు జోర్డాన్. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 4 ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl