ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యరీతిలో పేలవా ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఏకంగా మూడు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్ లో ఉన్నప్పటికీ ఎందుకో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోతోంది అనే చెప్పాలి. అయితే సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని తన వారసుడు అంటూ పేరు సంపాదించుకున్న రవీంద్ర జడేజా కి సారధ్య  బాధ్యతలను అప్పగించడం గమనార్హం.



 రవీంద్ర జడేజా కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఓటమి చవి చూస్తూనే ఉంది. దీంతో జడేజా కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మళ్లీ సారథ్య బాధ్యతలను మహేంద్రసింగ్ ధోని తీసుకోవాలంటూ ఎంతోమంది అభిమానులు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. గత రాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కనీస పోటీ ఇవ్వలేక దాదాపు 54 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 మెగా టోర్నీ ఐపీఎల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివర్లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గాడిలో పడాలంటే కొత్త దారులు వెతుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. మేం పవర్ ప్లే లో చాలా వికెట్లు కోల్పోయామ్ అంటూ తెలిపిన రవీంద్ర జడేజా తొలి బంతి నుంచే వెనకబడి పోయాము అంటూ తెలిపాడు. జట్టు బలంగా మళ్లీ పుంజుకోవడానికి మాత్రం కొత్త దారి వెతకాల్సిన అవసరం ఉంది. రుతురాజ్ కీ భరోసా ఇవ్వాలి. అతడికి అండగా ఉండాలి.. అతడు ఎంతో మంచి ఆటగాడు అందరికీ తెలుసు.. ఖచ్చితంగా రుతురాజ్ విషయంలో అండగా ఉంటాం రాబోయే మ్యాచ్ రుతురాజ్ బాగా రాణిస్తాడు అన్న నమ్మకం ఉంది మిడిల్ ఆర్డర్ లో శివం దూబే అద్భుతంగా రాణిస్తున్నాడు ఇకపై శక్తిమేరకు ప్రయత్నించి మళ్లీ పుంజుకునెందుకు ప్రయత్నిస్తాం అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl