ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇక మెగా వేలం కారణంగా కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న అన్ని జట్లు సరికొత్త ప్రస్థానాన్ని ఇక ఈ ఏడాది నుంచి మొదలు పెడుతూ ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత సీజన్ వరకు టైటిల్ కోసం పోరాడి నిరాశ పడిన ఎన్నో జట్లు ఇప్పుడు మాత్రం కొత్త ఆటగాళ్లతో జట్టును ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా మారిపోతుంది అని చెప్పాలి.


 అయితే ఇక టి20 ఫార్మాట్ అంటే ప్రతీ ఆటగాడికి సవాల్తో కూడుకున్నది. ఎందుకంటే బ్యాటింగ్ చేయడానికి వచ్చే ఆటగాడు ప్రతి బంతిని కూడా బౌండరీకి తరలించాలానే ఆలోచనతోనే ఉంటాడు. అదే సమయంలో బౌలింగ్ చేసే ఆటగాడు ప్రతి బంతికి వికెట్ పడగొట్టాలి అనే కసితోనే బంతులను సంధిస్తూ ఉంటాడు. ఇలా బ్యాట్ కి బంతి కి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఈ పోరు అటు ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది మ్ అయితే టీ-20 ఫార్మెట్లో చివరి ఓవర్లో ఎంత ముఖ్యమో ఇక పవర్ ప్లే ఓవర్ లు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇక ఒకవైపు చివరి ఓవర్లో మరోవైపు పవర్ ప్లే లో ఉండే ఆరు ఓవర్లు కూడా మ్యాచ్ ను హైలైట్ చేస్తూ ఉంటాయి.


 ఈ క్రమంలోనే పవర్ ప్లే లో ఎక్కువ రన్స్ చేయడానికి ప్రతీ బ్యాట్స్మెన్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో పవర్ ప్లే లో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్ మెన్ ఎవరో తెలుసుకుందాం.. 2019 నుంచి చూసుకుంటే శిఖర్ ధావన్ 926 పరుగులతో ఫోర్ ప్లే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా టాప్ లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత క్వింటన్ డికాక్ 847 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 825 పరుగులతో మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. పృథ్వీ షా 806 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 739 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl