ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్ పై ఎంతో అలవోకగా విజయం సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై  విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.


 ఈ క్రమంలోనే ఢిల్లీ విజయంలో అటు ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర వహించాడు అనే చెప్పాలి. 41 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు డేవిడ్ వార్నర్.. ఇక మరోవైపు మిచెల్ మార్ష్ ఎంతో దూకుడుగా ఆడుతూ 62 బంతుల్లో 79 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మిచెల్ మార్ష్ ఎంపిక అయ్యాడు అని చెప్పాలి.


 ఇకపోతే ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో అటు డేవిడ్ వార్నర్ అదృష్టం రాజస్థాన్ కొంప ముంచిందని చెప్పాలి. ఇన్నింగ్స్ లో 9 ఓవర్ చాహల్  వేసాడు. చాహల్ వేసిన బంతి వార్నర్ బ్యాట్ కి చిక్కకుండా ఆప్ స్టంప్స్ కీ తాకూతూ వెళ్ళిపోయింది.  వికెట్ దక్కించుకున్న చాహల్ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. వికెట్ ను బంతి ఎంతో నెమ్మదిగా తాకడంతో  లైట్ వెలిగింది. కానీ అప్పటికీ బెయిల్ మాత్రం కింద పడలేదు. దీంతో వార్నర్ నాటౌట్ గా నిలిచాడు అని చెప్పాలి. ఒక వేళ బెయిల్ కిందపడి వార్నర్ అవుట్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక అప్పటికే డేవిడ్ వార్నర్ 22 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: