ఐపీఎల్ 15 లో గుజరాత్ టైటాన్స్ పాల్గొన్న మొదటి సారి అద్భుతంగా రాణించి ఐపీఎల్ టైటిల్ ను పొందగలిగింది. దీనితో ఈ టీం ను విజయవంతంగా నడిపించిన ఆ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య పై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సరిగ్గా కొద్ది కాలం క్రితం జట్టులోని చోటు గల్లంతైన నేపథ్యంలో ఐపీఎల్ తో రిటర్న్ అయ్యి ఏకంగా టైటిల్ ను గెలవడం అంటే మాములు విషయం కాదు. తనపైన నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీ యాజమాన్యం మరియు టీమ్ కోచ్ లు పెట్టుకున్న నమ్మకాన్ని అబాసు పాలు చేయకుండా సక్సెస్ చేసి చూపించాడు. ఇప్పుడు టీమ్ ఇండియాలో అందరి నోటా వినిపిస్తున్న పేరు హార్దిక్ పాండ్య ది ఆల్ రౌండర్.

ఇదిలా ఉంటే ఈ విజయం వెనుక ఒక్క హార్దిక్ పాండ్య మరియు జట్టు కృషి మాత్రమే లేదు. ఇంతటి అసాధారణమైన విజయం వెనుక గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా కృషి ఎంతో ఉంది. మొదటి మ్యాచ్ నుండి ఫైనల్ వరకు జరిగిన వాటిలో ఆశిష్ నెహ్రా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఆలోచనా విధానం ఇవి అన్నీ ఉన్నాయి. నిజంగా ఆశిష్ నెహ్రా గుజరాత్ హెడ్ కోచ్ గా ఎంపికయ్యాక అందరూ పెద్దగా పట్టించుకోలేదు. కొందరు అయితే ఆలు ఖాతరు చేయలేదు. కానీ ఆశిష్ నెహ్రా ఇవన్నీ పట్టించుకోలేదు. తనకు దొరికిన ఆటగాళ్ల నుండి ఎలా మ్యాచ్ ను గెలిపించగలిగే ఆటను రాబట్టుకోవాలి అన్నదానిపై ఏకాగ్రత ఉంచాడు, చివరికి అనుకున్నది చేసి చూపించాడు.

దీనితో నెహ్రా పై అంచనాలు పెరిగిపోయాయి. కోచ్ గా తనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ కు కోచ్ అవుతాడు అని వార్తలు ఎక్కువయ్యాయి. కాగా ప్రెజెంట్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. అయితే ఇతను సరైన స్థాయిలో టీమ్ ను నడపడంలో తడబడుతున్నాడు అని క్లియర్ గా అర్ధమవుతోంది. ఇదే విధంగా టీమ్ ఇండియా కనుక సరైన విజయాలు సాధించకపోతే కొంతకాలం తర్వాత రాహుల్ ద్రావిడ్ పై వేటు వేయక తప్పదు. ఆ పరిస్థితి వస్తే నెహ్రా కోచ్ గా సరిపోతాడు అన్నది మెజారిటీ అభిప్రాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: