రెండు రోజుల క్రితం ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ ల మధ్య లార్డ్స్ లో మొదలైన మొదటి టెస్ట్ రోజుకో తీరుగా మారుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో బౌలర్ల హవా నడిచింది. ఇక న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకమైన సమయంలో కివీస్ ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని అయిదవ వికెట్ కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేసి ఇంగ్లాండ్  బౌలర్లకు షాక్ ఇచ్చారు. అయితే మూడవ రోజు ఆటలో మాత్రం మళ్ళీ పుంజుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు కివీస్ ను 285 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో డారైల్ మిచెల్ సెంచరీ (108) తో ఆకట్టుకోగా, కీపర్ బ్యాట్స్మన్ టామ్ బ్లండల్ (96) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్ (2), బ్రాడ్ (3), పాట్స్ (3) వికెట్లతో చెలరేగి కివీస్ ను కుప్ప కూల్చారు.

281 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ ప్రస్తుతం 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. క్రీజులో రూట్ మరియు బెన్ స్టోక్స్  లు ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుంది అన్నది ఇంకా ఒక స్పష్టత రాలేదు అని చెప్పాలి. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గెలిచే సత్తా హోమ్ టీమ్ ఇంగ్లాండ్ కే ఉందంటున్నారు. అయితే కివీస్ విజయావకాశాలను కూడా ఇక్కడ కొట్టి పారేయలేము. ఒక్క వికెట్ చాలు మ్యాచ్ లో విజయం సాధించడానికి... అయితే ప్రస్తుతం రూట్ కనుక క్రీజులో కుదురుకున్నాడంటే కివీస్ కు ఓటమి తప్పదు.

మరి కివీస్ బౌలర్లు ఇంగ్లాండ్ ను ఆల్ అవుట్ చేసి విజయాన్ని అందుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ లో కొత్తగా జర్నీ స్టార్ట్ చేసిన కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు ఇంగ్లాండ్ కొత్త కోచ్ బ్రెండన్ మెక్ కలమ్ కు యి మ్యాచ్ లో గెలవడం చాలా అవసరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: