క్రికెట్ ఆట కి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా టీవీ కి అతుక్కుపోతు ఉంటారు. ఉత్కంఠభరితంగా జరిగే క్రికెట్ మ్యాచ్ ను చూస్తూ తెగ మురిసిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే క్రికెట్ మ్యాచ్ లో బరిలోకి దిగే ప్రతి ప్లేయర్ కూడా అరుదైన రికార్డు సృష్టించాలని భావిస్తూ ఉంటారు. కానీ అనుకోని విధంగా కొన్ని కొన్ని సార్లు మాత్రం  చెత్త రికార్డులు ఖాతాల్లో చేరిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత చెత్త రికార్డు నమోదయింది.


 ఇక ఈ చెత్త రికార్డు గురించి తెలుసుకుని ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ఒక జట్టు 8 పరుగులకే ఆలౌట్ అయిన ఘటన ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అండర్ 19 నేపాల్ మహిళల జట్టు ఈ చెత్త రికార్డును నమోదు చేసింది.  ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో నేపాల్ మహిళల జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో తలపడింది. ఇక ఈ మ్యాచ్లో నేపాల్ మహిళల జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌట్ అయింది.


 దీంతో క్రికెట్ చరిత్రలో అత్యల్ప  స్కోరుకు ఆల్ అవుట్ అయిన జట్టుగా నేపాల్ అతిపెద్ద చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది అనే చెప్పాలి. నేపాల్ ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాటర్ లు కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరిపోయారు. తర్వాత వచ్చిన బ్యాటర్ స్నేహ 3 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది అనే చెప్పాలి. ఇక ఇలా చెత్త  రికార్డును సొంతం చేసుకున్న నేపాల్ జట్టు మునుపటి మ్యాచ్లో మాత్రం ఏకంగా 79 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం. ఇక అంతకుముందు మ్యాచ్లో  నేపాల్ జట్టు ఖాతార్ ను 38 పరుగులకే ఆలౌట్ చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: