గత కొంత కాలం నుంచి భారత మహిళల జట్టు ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా అద్భుతంగా రాణించిన భారత మహిళల జట్టు రజత పతకం తో మెరిసింది అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే కామన్వెల్త్  క్రీడల తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న జట్టు త్వరలో ఇంగ్లాండ్లో పర్యటించేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది.. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో మూడు వన్డేలు, మూడు టి20ల సిరీస్ ఆడబోతుంది. ఇకనుండి ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ల పోయే జట్టు వివరాలను ప్రకటించింది బీసీసీఐ.



 టీ20 వన్డే సిరీస్లో ఆడబోయే జట్లను వేరువేరుగా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలోనే వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి ఇటీవలే తిరిగి జట్టులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. అదే సమయంలో యువ వికెట్-కీపర్ యష్థిక భాటియా ను టీ-20 జట్టు నుంచి తొలగించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్ కోసం 18 మంది సభ్యులను ఎంపిక చేశారు.. అయితే కొంతమంది ప్లేయర్లను మినహాయిస్తే మిగతా అందరి పేర్లు కూడా ఊహించినట్లుగానే ఉన్నాయని చెప్పాలి. కాగా ఇంగ్లాండ్  పర్యటనలో అటు టీమిండియా ఎలా రాణించ పోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

 కాగా బీసీసీఐ ప్రకటించిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.


టీ20 జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, జెమీమా రోడ్రిగ్జ్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, రాధా యాదవ్, షబినేని మేఘనా, తానియా భాటియా, రాజేశ్వరి గైక్వాడ్, డి హేమలత, సిమ్రాన్ దిల్ బహదూర్, కిరణ్ నవ్గిరే

వన్డే జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, జెమీమా రోడ్రిగ్స్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, షబ్బినేని మేఘన, తానియా భాటియా, యస్తికా భాటియా, రాజేశ్వరి, రాజేశ్వరి డి హేమలత, సిమ్రాన్ దిల్ బహదూర్, ఝులన్ గోస్వామి, హర్లీన్ డియోల్.

మరింత సమాచారం తెలుసుకోండి: