ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ డైలాగ్ను ఎంతోమంది కొన్ని కొన్ని సందర్భాలను బట్టి వాడుతూ ఉంటారు.  కొంతమంది విషయంలో కూడా ఈ డైలాగ్ సరిగ్గా సరిపోయే విధంగానే ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు టీమిండియాలో స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే టీమిండియా లో ఎంతో మంది యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ కి అసలు అవకాశం దక్కలేదు. తన సహచర ఆటగాడు రిషబ్ పంత్  టీమిండియా లోకి వచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సమయంలో సూర్య  కుమార్ యాదవ్ మాత్రం ఇండియాలో అవకాశం కోసం ఎదురు చూశాడు.



 కానీ ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగా మిగతా ప్లేయర్ లతో పోల్చి చూస్తే కాస్త లేటుగా టీమిండియా లో అవకాశం దక్కించుకున్నప్పటికీ తన అద్భుతమైన ఆటతీరుతో తక్కువ సమయంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు సూర్యకుమార్ యాదవ్. ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే అతను 360 డిగ్రీస్ ఆటగాడు అంటూ ఎంతో మంది అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


 ఇటీవలే సూర్యకుమార్ యాదవ్ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య కుమార్ యాదవ్ టీమిండియాకు ఒక పెద్ద ఆస్తి అంటూ చెప్పుకొచ్చాడు.  సూర్యకుమార్ యాదవ్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ అంటూ ప్రశంసించాడు. ప్రపంచంలోనే 5 అత్యుత్తమ టి20 ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఇటీవల కాలంలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడని టీ20 లలో పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అంటూ షేన్ వాట్సన్ తెలిపాడు.



 ఇటీవల తన బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో రెండవ స్థానానికి దూసుకొచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్, డేవిడ్ వార్నర్, బాబర్ అజాం విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని షేన్ వాట్సన్ జోస్యం చెప్పాడు. కాగా అక్టోబర్ 16 వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది.  కప్పు గెలవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: