ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎక్కువగా పొల్యూషన్ కలిగిన రాష్ట్రం ఏది అంటే ఇక చిన్నపిల్లాడిని అడిగిన చెప్పేస్తాడు అది ఏదో కాదు దేశ రాజధాని ఢిల్లీ అని. ఏకంగా ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో పరిస్థితులు దారుణంగా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా చలికాలంలో పొగ మంచు పేరుకు పోయినట్లుగానే ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఎప్పుడు పరిస్థితి పొగ మంచు పేరుకుపోయినట్లు గానే పర్యావరణం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 తద్వారా ఇక ఢిల్లీలో ఉండేవారు కనీసం నాణ్యమైన గాలి కూడా పీల్చలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక కొన్ని కొన్ని సార్లు అయితే కాలుష్యం పెరిగిపోయిన సమయంలో విద్యా సంస్థలు ఆఫీసులకు సైతం అటు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఢిల్లీలో కాలుష్యం మరింత పెరిగిపోవడంతో ప్రభుత్వం కాలుష్యం నివారణకు చర్యలు చేపట్టింది. అయితే ఇలా ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడం పై ఇప్పటికే  ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక అక్కడి పరిస్థితిపై ఎంతోమంది  క్రీడా సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ఇటీవలే ఇదే విషయంపై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత చూస్తుంటే ఎంతో బాధగా ఉంది అంటూ శికర్ ధావన్ వ్యాఖ్యానించాడు. ప్రజలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి అంటూ కోరాడు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ  ధావన్ చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీ వాసులంతా ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం వాహనాలను పంచుకోండి అంటూ శిఖర్ ధావన్ ఢిల్లీ వాసులకు సూచించాడు. ఇకపోతే ఇటీవల ఢిల్లీలో గాలి నాణ్యత మరింత తగ్గినట్లు అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: