ఈ రోజు ఉదయం న్యూజిలాండ్ మరియు ఐర్లాండ్ ల మధ్యన సూపర్ 12 లో రెండు జట్లు కూడా తమ ఆఖరి మ్యాచ్ ను ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ గెలిచినా సెమీస్ కు చేరడం కుదరదు కాబట్టి, న్యూజిలాండ్ గెలవడం చాలా ముఖ్యం. మొదట టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది, బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు ఓపెనర్లు ఇద్దరూ మంచు ఆరంభాన్ని అందించారు. మరోసారి పిన్ అలెన్ మంచి స్టార్ట్ ను భారీ స్కోర్ గా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. కాగా కాన్ వే ఈసారి కూడా ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్ విలియమ్సన్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించాడు .

ఇక గ్లెన్ ఫిలిప్స్ ఉన్నంత సేపు బాగా ఆడినా తొందరపడి అనవసర షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.  ఆ తరువాత మిచెల్ క్రీజులోకి వచ్చి విలియమ్సన్ కు చక్కని తోడ్పాటును అందించాడు. అలా న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్ లలో 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇందులో ఫిన్ అలెన్ (32) , విలియమ్సన్ (61) , ఫిలిప్స్ (17), మిచెల్ (31) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ మొత్తం మూడు వికెట్లు తీసుకుని పిక్ అప్ ది బౌలర్ గా నిలిచాడు. అయితే లిటిల్ తీసుకున్న ఈ మూడు వికెట్లు కూడా ఇన్నింగ్స్ 19 వ ఓవర్లో వచ్చినవే కావడం విశేషం..

అంతే కాకుండా ఈ మూడు వికెట్లు రెండవ బంతికి విలియంసన్, మూడవ బంతికి నీషం మరియు నాలుగవ బంతికి శాంట్ నర్ లను నిప్పులు చెరిగే బంతులతో అవుట్ చేశాడు. తద్వారా 2022 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ తీసిన రెండవ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. సూపర్ 12 కు ముందు యూఏఈ కి చెందిన కార్తీక్ మేయప్పన్ శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించాడు. కాగా ఓవరాల్ గా లిటిల్ తో కలిపి ఆరు మంది మాత్రమే హ్యాట్రిక్ ను సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: