టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు చివరికి గడ్డు పరిస్థితుల మధ్య వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సొంత గడ్డపై వరల్డ్ కప్ జరిగినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఆస్ట్రేలియా జట్టు. విదేశీ గడ్డపై మ్యాచ్ లు ఆడిన కూడా ప్రత్యర్థులపై ఆదిపత్యం చెలాయించే ఆస్ట్రేలియా జట్టు సొంత గడ్డపై తమ సత్తా ఏంటో చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలోనే వరుసగా రెండోసారి వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది అనుకున్న ఆస్ట్రేలియా లీగ్ దశ నుంచి ఇంటి బాట పట్టింది.


 ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఇక సెమీ ఫైనల్లో అవకాశం దక్కించుకుంది. అయితే ఇంగ్లాండ్ తో సమానంగానే ఆస్ట్రేలియా కూడా పాయింట్లు సాధించినప్పటికీ ఇక సెమి ఫైనల్ అవకాశాల విషయంలో రన్ రేట్ కీలక పాత్ర వహించింది. ఆస్ట్రేలియా కంటే ఇంగ్లాండ్ కు మెరుగైన రన్ రేట్ ఉండడంతో ఇక ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక ఆస్ట్రేలియా విషయంలో కూడా ఒక పాత ట్రెడిషన్ రిపీట్ అయింది అన్న వార్త మాత్రం వైరల్ గా మారిపోయింది.



 ఆస్ట్రేలియా ప్రస్తుతం వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడంతో  పాత ట్రెడిషన్ రిపీట్ అయ్యింది అంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2007లో టి20 ఫార్మాట్లో వరల్డ్ కప్ ప్రారంభం అయిన నాటి నుంచి కూడా ఏ జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలవలేదు. 2007లో ఇండియా, 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లాండ్, 2012లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక, 2016లో వెస్టిండీస్, 2021లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లు గెలుచుకున్నాయి. కానీ ఏ ఛాంపియన్ జట్టు కూడా వరుసగా రెండుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలవలేదు అని చెప్పాలి. ఇప్పుడు ఆస్ట్రేలియా విషయంలో కూడా ఇదే జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: