ఎన్నో రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన వరల్డ్ కప్ ఇక ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సూపర్ 12 మ్యాచ్ లు హోరాహోరీగా జరగా.. ఇక ఇప్పుడు నాలుగు జట్లు సెమీఫైనల్ లో అడుగుపెట్టాయి. ఇక ఈ నాలుగు జట్లు కూడా 9, 10 తేదీలలో వరసగా రెండు రోజులపాటు సెమి ఫైనల్ మ్యాచ్లో ఆడబోతున్నాయి అని చెప్పాలి. సెమి ఫైనల్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ లు అడుగుపెట్టి అక్కడ మరోసారి పోరు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి.


 అయితే వరల్డ్ కప్ లో భాగంగా నాలుగు జట్లు  సెమీఫైనల్ అర్హత సాధించినప్పటికీ అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఫైనల్ చేరాలి అని కోరుకుంటుంది మాత్రం భారత్ పాకిస్తాన్ జట్లను మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఇక వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఉత్కంఠ భరితమైన దాయాదుల పోరును చూసి తరించిపోయిన క్రికెట్ ప్రేక్షకులు ఇక మరోసారి ఫైనల్ లో ఇలాంటి పోరు జరిగితే చూడాలని ఆశపడుతున్నారు. కేవలం క్రికెట్ ప్రేక్షకులే కాదు మాజీ ఆటగాళ్లు సైతం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ మనసులో ఉన్న మాటను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టేస్తున్నారు.


 ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్ జట్లు వరల్డ్ కప్ ఫైనల్స్ లో తలబడాలని క్రికెట్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు నేను మేల్ బోర్న్ లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ చూడలేదు. ఆ ముందు రోజు జరిగిన మ్యాచ్ కి కామెంట్రీ ఇవ్వడంతో ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడటం కుదరలేదు. ఫైనల్స్ లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే మిస్ అవ్వకుండా చూస్తాను. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగిన ఆ కిక్కే వేరు అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc