
కేవలం ఐపిఎల్ తోనే ఇక తమ బిజినెస్ ఆపేయకుండా యూఏఈ లో జరిగే ఇంటర్నేషనల్ టి20 లీగ్, దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే టి20 లీగ్ లో కూడా పెట్టుబడులు పెట్టారు రిలయన్స్ యాజమాని ముఖేష్ అంబానీ. ఇలా అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇన్నాళ్లపాటు క్రికెట్లో పెట్టుబడులు పెట్టి సూపర్ సక్సెస్ అయినా ముఖేష్ అంబానీ కన్ను ప్రస్తుతం ఫుడ్ బాల్ మీద పడింది అనేది తెలుస్తుంది. త్వరలోనే ఆయన దిగ్గజ ఫూట్ బాలర్ ఫ్రాంచైజీకి ఓనర్ కాబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో విజయవంతమైన అర్సనల్ ఫుట్బాల్ జట్టును కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఫుడ్ బాల్ ప్రతినిధులతో అంబానీల చర్చలు ముగిశాయని ఒప్పందానికి సంబంధించిన తుది చర్చలు జరగాల్సిన అవసరం ఉంది అన్నది తెలుస్తుంది. కాగా ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ ఆర్సనల్ ఫుట్బాల్ టీం కి వీరాభిమాని కావడం గమనార్హం. ఇప్పుడు ఒకవైపు ముంబై ఇండియన్స్ తో పాటు ఎమ్ఐ ఎమి రేట్స్, ఎమ్ఐ కేప్ టౌన్ లకు కూడా ఆకాష్ అంబానీ యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు ఫుట్బాల్ లోకి అడుగుపెట్టి ఆర్సనల్ ఫుట్బాల్ క్లబ్ ను దక్కించుకోవడానికి కూడా ఆకాష్ అంబానీనే ఆసక్తి చూపుతున్నారు అన్నది తెలుస్తుంది.