ఇటీవల కాలంలో టీమిండియా జట్టులో ట్రబుల్ షూటర్ గా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న వన్డే ఫార్మట్ లో తన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్న శ్రేయస్ ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లో కూడా అదరగొట్టాడు అని చెప్పాలి. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 50 పరుగుల వ్యవధిలోని మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో ఐదో వికెట్ కు చటేశ్వర పూజారతో కలిసి 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.


 ఈ క్రమంలోనే  ఈ ఇన్నింగ్స్ లో భాగంగా 10 పరుగులు పూర్తి చేయడంతో భారత క్రికెట్లో అతని పేరిట ఒక ప్రత్యేకమైన రికార్డు నమోదయింది అని చెప్పాలి. తొలి 10 టెస్ట్ ఇన్నింగ్స్ లలో కూడా రెండు అంకెల స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా భారత్ నుంచి తొలి ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు. నవంబర్లో కాన్పూర్ వేదిక న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసాడు శ్రేయస్ అయ్యర్. అయితే ఈ మ్యాచ్ అతనికి ఎంతో చిరస్మరణీయం అని చెప్పాలి. ఎందుకంటే తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో  65 పరుగులు చేసి ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.


 ఇలా తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ నుంచి మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ వరకు 12 టెస్టులు ఆడాడు శ్రేయస్ . ఇక అన్ని టెస్టులలో కూడా 10 కంటే ఎక్కువ పరుగులు చేసి డబల్ డిజిట్ స్కోర్ సాధించాడు.  ఇటీవల చటోగ్రామ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో 86 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు భారత క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న టెండూల్కర్, భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ కానీ ఈ రికార్డును సాధించలేకపోయారు. ఇక కోహ్లీ సైతం ఈ రికార్డును అందుకోలేదు. శ్రేయస్ సయ్యర్ ఒక్కడే ఇక టెస్టుల్లో భారత్ తరపున ఈ రికార్డు అందుకున్నాడు అని చెప్పాలి.  అదే సమయంలో మూడు ఫార్మట్ లలో కలిపి ఈ ఏడాది 1424 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా ఇక సూర్యకుమార్ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: