గత కొంతకాలం నుంచి టీమిండియా ఓపెనింగ్ జోడీ విషయంలో ఎంతల అయోమయ పరిస్థితి నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ రెగ్యులర్ ఓపెనర్ గా కొనసాగుతూ వున్నాడు. అయితే రోహిత్ శర్మకు జోడిగా టి20 ఫార్మాట్లో కే ఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఉండగా.. మొన్నటి వరకు అటు వన్డే ఫార్మాట్లో మాత్రం శిఖర్ ధావన్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి ఎందుకో ఓపెనింగ్ జోడి మాత్రం పెద్దగా ప్రభావం చూపలేక పోతుంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడి పేలవమైన ప్రదర్శనతో టీమ్ ఇండియాను మొదట్లోనే కష్టాల్లోకి నెడుతుంది అన్న విషయం తెలిసిందే.


 మంచి ఆరంభాలు అందించలేక మొదట్లోనే వికెట్లు కోల్పోతున్న నేపథ్యంలో తక్కువ పరుగులకే కష్టాల్లో పడిపోతూ ఉంది టీమ్ ఇండియా జట్టు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ల పైన భారం పడిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఓపెనర్లుగా ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారని చెప్పాలి.


 టీమిండియా ఓపెనింగ్ జోడి పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న రోజుల్లో వన్డే క్రికెట్లో రోహిత్ శర్మతో పాటు ఓపనరుగా ఇషాన్ కిషన్ ను బరిలోకి దింపాలి అంటూ గౌతమ్ గంభీర్ సూచించాడు. రాహుల్ కన్నా ఇషాన్ కిషన్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు అని చెప్పాలి. ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్లో ఇషాన్ కిషన్ ప్రదర్శన ఇందుకు నిదర్శనం అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు. బ్యాటర్ వికెట్ కీపర్ గా కూడా కిషన్ రానిస్తున్నాడని.. అందుకే అతన్ని ఓపెనర్ గా కొనసాగించాలని సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: