ప్రస్తుతం శ్రీలంక మెన్ క్రికెట్ టీం ఇండియా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మొత్తము మూడు టీ 20 లు మరియు వన్ డే లు ఆడనున్నాయి. ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా రేణుడి పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అదే విశ్వాసంతో నిన్న రాత్రి పుణేలో రెండవ మ్యాచ్ లో రెండు టీం లు తలపడ్డాయి, ఇందులో శ్రీలంక గత మ్యాచ్ లో జరిగిన తప్పిదాలను సరిచేసుకుని బరిలోకి దిగి ఇండియాను ఏకంగా 16 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకునే ఇండియా శ్రీలంకను కట్టడి చేయడంలో పూర్తిగా విపలం అయింది. శ్రీలంక నిర్ణీత ఓవర్ లలో 206 పరుగులు చేసి ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇండియా బౌలర్లు ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయారు. గత మ్యాచ్ లో యువ పేసర్ శివమ్ మావి అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకుని బీసీసీఐ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే తన ప్రదర్శన కేవలం ఒక మ్యాచ్ తోనే ముగిసిపోయిందా అంటే అవుననే చెప్పాలి. రెండవ మ్యాచ్ లో శివం మావి నాలుగు ఓవర్లు వేసి ఏకంగా ఓవర్ కు 13.2 సగటుతో 53 పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి మ్యాచ్ లో ఎంత పదునైన బంతులను ప్రత్యర్థులపై సంధించాడో రెండవ మ్యాచ్ లో పూర్తిగా వేగం, బౌన్స్, లెంగ్త్ తగ్గాయని  చెప్పాలి.

శివమ్ మావి వికెట్లు సాధించకపోయినా పర్వాలేదు... కానీ టీ 20 ఫార్మాట్ లో పరుగులు నియంత్రించడం చాలా ముఖ్యం. కానీ అందులోనూ ఈ కుర్రాడు ఫెయిల్ అయ్యాడు. ఒక్క అక్షర్ పటేల్ మినహా మారె భారత బౌలర్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇక బ్యాటింగ్ లో ఎప్పటిలాగే కీలక ఆటగాళ్లు రాణించడంతో ఫెయిల్ అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: