ఇండియన్ క్రికెట్ లో ఎన్నో అద్భుత విజయాలను మరియు ట్రోపీలను దేశానికి అందించిన చాలా మంది కెప్టెన్ లు ఉన్నారు. ఓల్డ్ డేస్ ను వదిలేస్తే నేటి కాలంలో మొదటగా గుర్తొచ్చే పేర్లు మహేంద్రసింగ్ ధోని మరియు విరాట్ కోహ్లీలు. ధోని మాత్రం తన కెప్టెన్సీలో మూడు ఐసీసీ టైటిల్ లను అందించగా, కోహ్లీ మాత్రం ఒక్కటే అందించలేకపోయాడు. కానీ కెప్టెన్ గా ఇద్దరూ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. ఆ తర్వాత కెప్టెన్సీ ని రోహిత్ శర్మకు అప్పగించగా అంత ప్రభావవంతంగా చేయలేకపోగా, తన బ్యాటింగ్ లో కూడా తడబడుతున్నాడు. ఈ మధ్యన తీసుకునే రోహిత్ శర్మ స్థాయికి తగిన ప్రదర్శన ఒక్కటీ లేకపోవడం తన అభిమానులను అలాగే బీసీసీఐని చాలా ఆందోళనకు గురి చేసింది.

అందుకే బీసీసీఐ 2023 లో సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. మూడు ఫార్మాట్ లకు కూడా ముగ్గురు కెప్టెన్ లు ఉండేలా జగ్రత్తలు తీసుకుంటోంది. టెస్ట్ లకు రోహిత్ శర్మ, వన్ డే లకు కే ఎల్ రాహుల్ మరియు టీ 20 లకు హార్దిక్ పాండ్యను కెప్టెన్ లుగా చేయడానికి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ 20 సిరీస్ తో పూర్తి స్థాయి కెప్టెన్ గా హార్దిక్ అయ్యాడు. తాను తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న ఐర్లాండ్ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసి సిరీస్ ను అందించాడు. కానీ ప్రస్తుతం శ్రీలంక తో జరుగుతున్న టీ 20 సిరీస్ ను అందిస్తాడా అని అంతా చర్చించుకుంటున్నారు.

కానీ శ్రీలంక జట్టు నుండి ఊహించినదానికంటే ఎక్కువగా పోటీ ఎదురవుతోంది. ఇక ఇండియాకు సీనియర్లు కోహ్లీ, రోహిత్, రాహుల్ మరియు పంత్ లు దూరం కావడం ఒక ప్రతికూలం అని చెప్పాలి. ప్రస్తుతం సిరీస్ 1-1 తో సమంగా ఉంది. రేపు రాజ్ కోట్ లో జరగనున్న సిరీస్ డిసైడర్ లో హార్దిక్ పాండ్య తన జట్టును సమర్థవంతంగా ఉపయోగించుకుని ఇండియాకు తన కెప్టెన్సీలో సిరీస్ ను అందిస్తాడా అన్నది చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: