ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లో సత్తా చాటి రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జట్టు రెండవ మ్యాచ్లో మాత్రం తేలిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 16 పరుగులు తేడాతో  శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే రెండవ టి20 మ్యాచ్ లో బ్యాటింగ్ విభాగం బౌలింగ్ విభాగం కూడా పూర్తిగా నిరాశపరిచింది అని చెప్పాలి. దీంతో టీం ఇండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


 ఇదిలా ఉంటే ఇక నేడు కీలకమైన మూడవ టి20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా ఇరుజట్లు చేరొక మ్యాచ్ గెలవడంతో 1-1 తో సిరీస్ సమంగా కొనసాగుతుంది.. కాగా నేడు మూడో టి20 మ్యాచ్ లో గెలిచిన జట్టు ఇక సిరీస్ కైవసం చేసుకుంటుంది అని చెప్పాలి. దీంతో ఇరు జట్ల మధ్య మరోసారి హోరాహోరీ పోరు జరగబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే మూడవ టి20 మ్యాచ్ లో అటు భారత తుదిజట్టులో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే  రెండవ టి20 మ్యాచ్ లో విఫలమైన అర్షదీప్ సింగ్  పై వేటు వేయబోతుంది. ఇక అతని స్థానంలో మూడో టి20 మ్యాచ్ లో ఫేసర్ ముఖేష్ కుమార్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తుందట. అదే సమయంలో ఇక భారీ అంచనాల మధ్య పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన శుభమన్ గిల్ అంచనాలను అందుకోలేకపోయాడు వరుసగా రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్ స్కోర్ కే   విఫలం అయ్యి నిరాశపరిచాడు. దీంతో అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్  ను.. ఇక స్పిన్నర్ చాహల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తుందట. మరోవైపు అరంగేట్రం మ్యాచ్లోనే విఫలమైన రాహుల్ త్రిపాటికి మాత్రం మూడవ టి20లో మరో అవకాశం ఇవ్వాలని భావిస్తుందట టీమ్ ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: