పాకిస్తాన్ జట్టు లో స్టార్ బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు షాహిన్ ఆఫ్రిది. పాకిస్తాన్ ఏదైనా జట్టుతో మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఇక ప్రత్యర్ధుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా తన ఫాస్ట్ బౌలింగ్ తో రాణిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం షాహిన్ ఆఫ్రిది  గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతూనే ఉన్నాడు. గత ఆరు నెలల నుంచి ఇక షాహిన్ ఆఫ్రిది కెరియర్ మొత్తం గాయాలతో జట్టుకు దూరం అవడంతోనే గడిచిపోయింది.



 ఈ క్రమంలోనే ఆసియా కప్ సహ ఇంగ్లాండ్ తో జరిగిన ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మళ్లీ ఫిట్నెస్ సాధించి టి20 వరల్డ్ కప్ లో ఆడినప్పటికీ దురదృష్టవశాత్తు ఫైనల్లో ఫీల్డింగ్ చేస్తూ మళ్ళీ మోకాలి గాయం తిరగబెట్టడంతో మైదానం వీడాడు. ఇక ఆ తర్వాత వారం రోజులకే దుబాయిలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకున్నాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్, న్యూజిల్యాండ్  టెస్ట్ సిరీస్ లకు కూడా దూరం అయ్యాడు.


 అయితే ఇక ఇప్పుడు మాత్రం షాహిన్ ఆఫ్రిది పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల ఈ విషయాన్ని అతనే స్వయం గా వెల్లడించాడు. ప్రస్తుతం బౌలింగ్లో లయ అందుకున్నాను. పాకిస్తాన్ జట్టు లోకి పునరాగమనం చేసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ షాహిన్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. ఇక వరల్డ్ కప్ సమయం లో ఉన్నదానికంటే ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా మరింత మెరుగ్గా కనిపిస్తున్నాను. ఈ వారం 19 ఓవర్లు బౌలింగ్ చేశా.. ఇక వచ్చేవారం 25 ఓవర్లు బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తా అంటూ తెలిపాడు. ఇక ఫిబ్రవరిలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయానికి పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తానంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: