ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి నెలలో కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఇవ్వటం ఆనవాయితీగా  కొనసాగిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకోవడానికి ప్రతి ఒక్క ఆటగాడు కూడా అత్యంత ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరికి దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.  ఇకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.


 2022 డిసెంబర్ నెలకు గాను పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది అని చెప్పాలి. అయితే ఈ అవార్డు దక్కించుకుంది ఎవరో కాదు ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో కొనసాగుతూ ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా కొనసాగుతున్న ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హ్యారీబ్రూక్ ని ఈ అవార్డు వరించింది అని చెప్పాలి. 23 ఏళ్ల ఇంగ్లీష్ యువ బాట్స్మన్ పాకిస్తాన్ టూర్ లో ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో అందరూ చూశారు. మూడు టెస్టులలో 468 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఇక ఫలితంగానే ప్రస్తుతం ప్రేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అతని వరించింది అన్నది తెలుస్తుంది.


 అయితే ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం బ్రూక్ తో పాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ట్రవిస్ హెడ్ నుంచి కూడా తీవ్రమైన పోటీ ఉంది అని చెప్పాలి. కానీ చివరికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బ్రూక్ వైఫై ఎక్కువగా మొగ్గి చూపింది. కాగా బ్రూక్ ఆడిన 3 మ్యాచ్లలో మూడు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ చేసి పాకిస్తాన్ ను సొంత గడ్డపైనే మట్టి కరిపించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విషయానికొస్తే ఆస్ట్రేలియాకు చెందిన ఆశ్లే గార్డెనర్ ఈ అవార్డును గెలుచు కోవడం గమనార్హం. ఇటీవల బ్రూక్ ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఏకంగా 13.25 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: