ఒకవైపు టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్ళందదరూ గత కొంతకాలం నుంచి బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అటు బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కూడా అటు గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటికి మొన్న శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసిన గిల్ ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కూడా డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు.


 ఇలా ఒకవైపు టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లు సెంచరీలు డబుల్ సెంచరీ తో అదరగొడుతూ ఉంటే.. మరోవైపు అటు రంజీ ట్రోఫీలో వివిధ జట్ల తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు వరుస సెంచరీలతో చెలరేగిపోతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక తమ బ్యాటింగ్ విధ్వంసంతో టీమ్ ఇండియా సెలెక్టర్ల చూపును ఆకర్షించడమె లక్ష్యంగా దూసుకుపోతున్నారు ఎంతో మంది ఆటగాళ్లు. ఈ క్రమంలోనే గత కొంతకాలం  నుంచి పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న మయాంక్ అగర్వాల్ ఇటీవలే  రంజీ ట్రోఫీలో భాగంగా డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు.


 రంజీ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం కర్ణాటక జట్టు తరఫున మయాంక్ అగర్వాల్ ప్రాతినిథ్యం  వహిస్తున్నాడు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి మంచి పరుగులు చేస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోరుగా మలచడంలో అతను సక్సెస్ కాలేకపోతున్నాడు. అయితే ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా కేరళతో జరిగిన మ్యాచ్లో మాత్రం తన బ్యాటింగ్ తో అదరగొట్టి డబుల్ సెంచరీ చేశాడు మయాంక్ అగర్వాల్. మొత్తంగా 360 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు ఐదు సిక్సర్లతో 208 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మాయాంక్ డబుల్ సెంచరీపై ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: