ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు కామన్ మ్యాన్ కి మధ్య దూరం కేవలం ఒక గీత మాత్రమే అన్నట్లుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు ఇక చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు. ఇక ఎక్కడైనా షూటింగ్ జరుగుతుందంటే చాలు వారిని చూడడానికి తరలి వెళ్లేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏకంగా నేరుగా తమ అభిమాన హీరోలతోనే చాటింగ్ చేయగలుగుతున్నారు అని చెప్పాలి.


 అంతే కాదు తమ అభిమాన హీరోలు ఎక్కడికి వెళ్లారు ఏం చేస్తున్నారు.. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్లో ఉన్నారు అన్న పూర్తి వివరాలను కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అయితే అటు హీరోలు సైతం తమ అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండడానికి అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖాన్ సైతం గత కొంతకాలం నుంచి ఇలా అభిమానులతో తరచూ ముచ్చటిస్తూ ఉండడం గమనార్హం.


 అయితే ఇలా అభిమానులతో సోషల్ మీడియాలో షారుక్ ఖాన్ ముచ్చటించిన ప్రతిసారి కూడా అటు టీమిండియా స్టార్ క్రికెటర్లకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. గతంలో విరాట్ కోహ్లీ గురించి ఒక అభిమాని ప్రశ్న అడగగా.. ఇటీవలే రోహిత్ గురించి ఒక నిటిజన్ ప్రసరించాడు. ఇక అభిమానులతో మరోసారి షారుక్ ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఒక అభిమాని భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రశ్నించాడు.  టీమిండియా కెప్టెన్ రోహిత్ గురించి ఒక లైన్ లో వివరించాలి అంటూ కోరగా.. రోహిత్ ఎంతో తెలివైనవాడు అతనితో నేను కొన్ని మధురమైన వ్యక్తిగత క్షణాలను పంచుకున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు షారుక్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: