ఇటీవల కాలంలో విదేశీ జట్లు భారత పర్యటనకు వస్తూ ఉండగా అటు టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా గడుపుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే యువ క్రికెటర్లు సీనియర్ క్రికెటర్లు అనే తేడా లేకుండా అందరూ కూడా ఇక ప్రత్యర్థులపై పూర్తి అధిపత్యాన్ని చలాయిస్తూ ఇక వరుసగా సిరీస్ లను సొంతం చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా జట్టు మూడు మ్యాచ్లలో కూడా విజయం సాధించి 3-0 తేడాతో న్యూజిలాండ్ ను క్లీన్స్వీప్ చేసింది.


 ఇక ఇప్పుడు యువ ఆటగాడు హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో న్యూజిలాండ్తో టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది భారత జట్టు. అయితే వన్డే సిరీస్ లో లాగానే ఇక అదే జోరును టి20 సిరీస్ లో కూడా కొనసాగించాలని భావిస్తూ ఉంది అని చెప్పాలి. కాగా నేడు తొలి టీ20 మ్యాచ్ రాంచి వేదికగా జరగబోతుంది.  అయితే ఇక ఇటీవల కాలంలో టీమిండియా ఏ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఆ స్టేడియంలో టీమ్ ఇండియా గత గణాంకాలు ఏంటి.. ఎన్ని మ్యాచ్లు ఆడింది. ఎన్ని మ్యాచ్ లలో గెలిచింది అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు అందరూ కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నేడు రాంచి వేదికగా జరగబోయే తొలి టి20 మ్యాచ్ పాత గణాంకాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ స్టేడియంలో ఇప్పుడు వరకు టీమిండియా మూడు టి20 మ్యాచ్ లు ఆడింది. అయితే మూడింటిలో కూడా టీమిండి అనే విజయం సాధించడం గమనార్హం. ఈ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఒకసారి గెలిస్తే.. ఇక రెండోసారి బ్యాటింగ్ చేసి  రెండుసార్లు విజయం సాధించింది. ఇక ఇదే స్టేడియంలో భారత్ అత్యధిక స్కోరు శ్రీలంకపై చేసిన 196 పరుగులు కావడం గమనార్హం. దీంతో గణాంకాలు చూసుకుంటే టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: