
ఇదిలా ఉంటే.. నేడు రాత్రి 7 గంటలకు లక్నోలోని ఎకాన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండవ టి20 మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి టి20 మ్యాచ్ లో ఎంతోమంది యువ ఆటగాళ్లు నిరాశపరిచిన నేపథ్యంలో రెండో టి20 మ్యాచ్ లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అన్నది తెలుస్తుంది. ఓపెనింగ్ స్లాట్ లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉందట. అద్భుతం ఫామ్ లో ఉన్న పృథ్విషాను ప్లేయింగ్ ఎలవెన్ లోకి తీసుకోవాలని ఇప్పటికే డిమాండ్స్ వస్తు ఉండగా.. ఇక విఫలమవుతున్న రాహుల్ త్రిపాఠి ప్లేస్ లో పృథ్వి షా తుది జట్టులోకి తీసుకొని ఛాన్స్ ఉందట. అదే సమయంలో పృద్వి షా. ఓపెనర్ గా వస్తే ఇషాన్ కిషన్ వన్ డౌన్లో ఆడతాడు.
మొదటి మ్యాచ్ లో విఫలమైన దీపక్ హుడాకు రెండవ మ్యాచ్ మాత్రం అలాగే కొనసాగించే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. ఇక వాషింగ్టన్ సుందర్ దుమ్ము రేపుతూ ఉండడంతో అతని స్థానానికి డోకాలేదు. అయితే బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు ఖాయం అనేది తెలుస్తుంది. దారాళంగా పరుగులు ఇస్తున్న అర్షదీప్ పై వేటు వేసి ముఖేష్ కుమార్ కు చాన్స్ ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. దీంతో అతను తుది జట్టులో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రెండో టి20 లో ఇక ఈ రెండు మార్పులు చేయడం తథ్యం అనేది తెలుస్తుంది.
టీమిండియా తుది జట్టు (అంచనా): పృథ్వీ షా, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.