
ఇక టైటిల్స్ గెలవడంలో రోహిత్ శర్మ... అటు జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించడంలో మహేంద్రసింగ్ ధోని ఇద్దరు కూడా ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్లుగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఒకవేళ ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లలో కలిపి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలివెన్ జట్టును ఎంపిక చేస్తే ఇక ఆ జట్టుకు ఎవరు కెప్టెన్ గా ఉంటారు అన్న విషయం హాయ్ టాపిక్ గా మారిపోయింది. అయితే 2023 ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన ఓజా, రాబిన్ ఉత్తప్ప, ఆకాష్ చోప్రా, సురేష్ రైనా, ఆర్పి సింగ్, పార్దివ్ పటేల్ తదితరులు ఆల్ టైం ఫైనల్ టీంను ఎంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఐపిఎల్ ఆల్ టైం జట్టుకి ఎవరు కెప్టెన్ గా ఉంటారు అనే విషయంపై మాజీ ప్లేయర్ ప్రజ్ఞన్ ఓజా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే ఆల్ టైం జట్టుకు కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేసుకోవాలి అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాను మాత్రం మహేంద్రసింగ్ ధోని కంటే రోహిత్ శర్మ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిపాడు. ఒకరితో మరొకరిని పోల్చడం కొంచెం కష్టమె. వారిద్దరి మధ్య కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ఇద్దరు బౌలర్లకు అనుకూలమైన కెప్టెన్లే. అయితే నేను ఇప్పుడు కేవలం రోహిత్, ధోని సాధించిన టైటిల్స్ బట్టి ఇక కెప్టెన్సీ ఎవరికీ అప్పగించాలి అనే నిర్ణయం తీసుకుంటున్నాను. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఆధారంగా రోహిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేస్తున్నట్లు తెలిపాడు.