భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య t20 సిరీస్ మంచి ఉత్కంఠ భరితంగా జరుగుతోంది. ఈ పొట్టి సిరీస్ అనంతరం అంటే ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఆరంభం కానుందనే విషయం విదితమే. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. కాగా నేడు టెస్ట్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ బయల్దేరింది. ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్ 2023కి ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇపుడు సంచలనంగా మారింది.

విషయం ఏమంటే... గత పర్యటనలో bcci తమని మోసం చేసిందని, ఈ క్రమంలోనే ప్రాక్టీస్ మ్యాచ్‌లో గ్రీన్ టాప్ వికెట్ రూపొందించి, అసలు మ్యాచ్‌లకు మాత్రం స్పిన్ వికెట్ తయారు చేసి తమని పక్కదారి పట్టించిందని ఆరోపించాడు. భారత పర్యటనకు ముందు సిడ్నీలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొన్నామని, స్పిన్ వికెట్‌పై భారీగా సాధన చేశామని స్మిత్ పేర్కొన్నాడు. భారత్ ఫ్లైట్ ఎక్కేముందు డైలీ టెలిగ్రాఫ్‌తో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'సాధారణంగా ఏ పర్యటనకు వెళ్లినా ఆస్ట్రేలియా 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇటీవల ఇంగ్లండ్‌లో కూడా 2 టూర్ గేమ్స్ ఆడాం. అయితే ఈసారి భారతదేశంలో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది' అంటూ కాస్త తేడాగా మాట్లాడాడు.

కాగా ఈ వ్యాఖ్యలు నేడు వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగానే అందుకే భారత్‌లో ప్రాక్టీస్ గేమ్ ఆడకుండా మేం నిర్ణయం తీసుకున్నాం అని పలికాడు. ఇంకా స్మిత్ మాట్లాడుతూ.... 'సిడ్నీ వేదికగానే స్పిన్ ట్రాక్ తయారు చేసుకొని, అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు. భారత్‌తో బోర్డర్ గవాస్కర్ 2023 సిరీస్ ఆడేందుకు మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం కానీ గతంలో మాకు చేదు అనుభవం వుంది. భారత్‌లో మేం టెస్ట్ సిరీస్ గెలిచి చాలా రోజులు అవుతోంది. నేను ఇక్కడ ఇదివరకు 2 టెస్ట్ సిరీస్ ఆడాను. సవాళ్లకు మా జట్టు కూడా సిద్ధమే' అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: