
అయితే భారత జట్టు పోటీ ఇవ్వలేదు అని కొంతమంది అంచన కూడా వేశారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియా తో హోరాహోరీగా పోరాడింది అని చెప్పాలి. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఒకానొక సమయంలో ఓడించినంత పని చేసింది భారత జట్టు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరి వరకు పోరాడిన భారత జట్టు చివరికి ఐదు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది అని చెప్పాలి. అయితే కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ ఇక క్రీజ్ లో ఉన్నంతసేపు ఇక విజయం భారత్ వైపే ఉంది.
అయితే హార్మన్ ప్రీత్ అటు రన్స్ తీస్తున్న సమయంలో క్రీజులో బ్యాట్ పెట్టే సమయానికి బ్యాట్ మట్టిలో తట్టుకోవడంతో చివరికి దురదృష్టవశాత్తు సింపుల్ గా రన్ అవుట్ అయింది భారత కెప్టెన్. దీంతో ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ లేకపోవడంతో విజయం ఆస్ట్రేలియా వైపు వెళ్ళిపోయింది. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత కెప్టెన్ హార్న్ ప్రీత్ కి రన్ అవుట్ కావడన్ని.. ఇక మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్ తో పోలుస్తున్నారు అభిమానులు. ఇద్దరు జెర్సీ నెంబర్స్ సెవెన్ అని ధోని కూడా గతంలో వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఇలాగే రన్ అవుట్ అయ్యాడు అంటూ గుర్తు చేసుకుంటున్నారు.