
కానీ పవర్ ప్లే తర్వాత ఆశించిన స్థాయిలో గుజరాత్ ఇన్నింగ్స్ నడవలేదు. ఒకానొక దశలో కనీసం 150 పరుగులు చేస్తుందా అనిపించింది. కనీ హర్లీన్ డియోల్ 46, గార్డెనర్ 25 మరియు హేమలతలు 21 పరుగులు చేసి రాణించడంతో నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో చేధనను ఆరంభించిన యూపీ వారియర్స్ ఫేవరిట్స్ అనే అంతా అనుకున్నారు. యూపీ వారియర్స్ కు ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ ను చూస్తే ఈ స్కోర్ ను ఛేదించడం సులభమే అనుకున్నారు.
కానీ ఇన్నింగ్స్ మూడవ ఓవర్ లో ఆస్ట్రేలియా బౌలర్ కిమ్ గార్త్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఒకే ఓవర్ లో కెప్టెన్ హీలీ 7, శ్వేతా 5 మరియు మెక్ గ్రాత్ లను అవుట్ చేసి గుజరాత్ ను రేస్ లో నిలిపింది. ఇక యూపీ గెలవడం అసాధ్యం అనుకున్న సమయంలో కిరణ్ 53 గ్రేస్ హారిస్ 59 నాట్ అవుట్ మరియు సోపీ 22 పరుగులు చేసి యూపీ వారియర్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ముఖ్యంగా గ్రేస్ హారిస్ ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి. చివరి మూడు ఓవర్ లకు 53 పరుగులు అవసరం అయిన దశలో ఆకాశమే హద్దుగా చెలరేగి యూపీ ని విజయతీరాలకు చేర్చింది. దీనితో గుజరాత్ జాయింట్స్ కు వరుసగా రెండవ ఓటమి ఎదురైంది.