
చట్టోగ్రామ్ లో ముగిసిన మూడవ వన్ డే లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో రెండు వన్ డే లలో కన్నా కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బల్ మరియు లిటన్ దాస్ లు సరైన ఆరంభాన్ని అందించలేకపోయారు. ఆ తర్వాత శాంటో (53) మరియు రహీం (70) లు మూడవ వికెట్ కు 99 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత షకిబుల్ హాసన్ (75) ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో సంయమనంతో చివరి వరకు ఉండి 9 వ వికెట్ గా వెనుతిరిగాడు.
చివరికి బంగ్లా మరో 11 బంతులు మిగిలి ఉండగానే 246 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరణ్ 2, జోఫ్రా ఆర్చర్ 3 మరియు అదిల్ రశీద్ రెండు వికెట్లు తీసుకుని బంగ్లాను శాసించారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన్ అప్ తో పోలిస్తే ఈ స్కోర్ ను ఛేదించడం అంత కష్టం కాదు. కానీ బంగ్లా బౌలర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న ఇంగ్లాండ్ ను 50 పరుగుల తేడాతో మరో ఓవర్లు మిగిలి ఉండగానే ఆల్ అవుట్ చేసి ఘోరంగా ఓడించారు. అల్ రౌండర్ షకిబుల్ హాసన్ బ్యాటింగ్ లో 75 పరుగులు మరియు బౌలింగ్ లో 4 వికెట్లు తీసి బంగ్లాను విజయానికి చేరువ చేశాడు.