టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రిషబ్ పంత్ గత ఏడాది డిసెంబర్ చివరన రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అనే విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని రూర్కి సమీపంలో అతను ప్రయాణిస్తున్న బిఎండబ్ల్యూ కారు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ను బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో అతని కారు అక్కడికక్కడే పూర్తిగా కాలి బూడిద అయింది అని చెప్పాలి   అయితే అతను ఇక ప్రమాదం జరగడానికి ముందే కారు నుంచి దూకేయడంతో ఇక గాయాలతో బయటపడ్డాడు. అయితే అతనికి తీవ్ర గాయాలు అయిన నేపథ్యంలో ఇక ప్రస్తుతం అతను కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే రిషబ్ పంత్ త్వరగా కోలుకొని మళ్ళీ టీమిండియాలోకి రావాలని అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల రిషబ్ పంత్ నీటిలో ఒక కర్ర సహాయంతో మెల్లిమెల్లిగా నడుస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులందరూ కూడా గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అంతేకాదు మాజీ ఆటగాళ్ళు కూడా ఇక రిషబ్ పంతు లేని లోటు టీమ్ ఇండియాలో స్పష్టంగా కనిపిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఏకంగా గాయాలనుంచి కోలుకుంటున్నా యువ ఆటగాడు రిషబ్ పంతును స్వయంగా వెళ్లి కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రిషబ్ పంతును కలిసిన యువరాజ్ సింగ్ ఇక అతనితో దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు   ఆన్ టు బేబీ స్టెప్స్ ఈ ఛాంపియన్ త్వరలో కోలుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో యువరాజ్ సింగ్ పోస్ట్ పెట్టాడు అని చెప్పాలి. ఇలా స్వయంగా కలిసి రిషబ్ పంతుకు ధైర్యం చెప్పినందుకు యువరాజ్ సింగ్ కి పంత్ అభిమానులు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: