చాల రోజులుగా ఐపీల్ ప్రారంభం అవ్వబోతున్నందుకు క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ టైం లో గుజరాత్ టైటాన్స్ కి స్టార్ ప్లేయర్ గా ఉన్న కిల్లర్ మిల్లర్ ఆ జట్టు కి గట్టి షాక్ ఇచ్చాడు. ఈ సారి ఎలాగైనా బాగా ఆది ముందు కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనుకున్న గుజరాత్ జట్టు కు ఆరంభంలోనే ఇంత పెద్ద షాక్ రావడం ఆ జట్టు అభిమానులకు మింగుడు పడటం లేదు.


అసలు విషయంలోకి దక్షిణాఫ్రికా కు చెందిన కిల్లర్ మిల్లర్ సరిగ్గా ఐపీల్ ప్రారంభం రోజున నెదర్లాండ్స్ తో వన్ డే సిరీస్ లో పాల్గొనబోతున్నాడు. అందుకే ఐపీల్ ఆడటం కుదరదని అఫీషియల్ గా ప్రకటించాడు. నెదర్లాండ్స్ లాంటి జట్టు తో ఆడటానికి కిల్లర్ ఐపీల్ ని వద్దు అనుకోవడానికి గల ముఖ్యమైన మరొక కారణం ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి సౌత్ ఆఫ్రికా చేరాలంటే నెదర్లాండ్స్ తో జరిగే రెండు వన్డే మ్యాచులు ఖచ్చితంగా నెగ్గి తీరాలి. అందుకే మొదటి రెండు మ్యాచులు పాల్గొని కిల్లర్ తిరిగి ఐపీల్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.


 కేవలం కిల్లర్ మిల్లర్ మాత్రమే కాదు సఫారీ ప్లేయర్లు అందరు కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. డబ్బుల కన్నా కూడా జాతీయ అవసరాలు ముఖ్యం అని సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అంత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.  ఇక ఇప్పుడు మాత్రమే కాదు గత సీజన్ సమయం లో కూడా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే కొంత మంది ప్లేయర్స్ మాత్రం ఐపీల్ కి ఆడగా మరి కొంత మంది మాత్రం జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే లీగ్ లేదా జాతీయ జట్టు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల ఇష్టానికే వదిలేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: