
అయితే ఈ ఏడాది అటు వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక ఆయా దేశాల క్రికెట్ బదులు తమ ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఐపీఎల్ లో ఆడేందుకు కొంతమంది ఆటగాళ్లకు అనుమతి లభించడం కష్టమే అంటూ మొదటి వరకు వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే ఇలాంటి సమయంలో అటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పాలి. ఏకంగా ఇంగ్లాండు జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న లివింగ్ స్టోన్ ఐపీఎల్ 16వ తేదీన ఆడేందుకు.. ఆ దేశ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దీంతో మరోసారి ఐపీఎల్ 16వ సీజన్లో లివింగ్ స్టోన్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే గాయంతో బాధపడుతున్న మరో ఆటగాడు బెయిర్ స్ట్రోకు మాత్రం అటు ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు ఇంగ్లాండు క్రికెట్ బోర్డు. కాగా 2022 మినీ వేలంలో లివింగ్ స్టోన్ ని 11.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది అని చెప్పాలి. బెయిర్ స్ట్రో ను కూడా పంజాబ్ కింగ్స్ జట్టు 7.61 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇక ఇప్పుడు లివింగ్ స్టోన్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి అనుమతి రావడం మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టుకు పెద్ద శుభవార్త అని చెప్పాలి.