
అయితే ధోని శిష్యుడుగా పేరున్న హార్దిక్ పాండ్యా అప్పుడప్పుడు ధోని తరహాలోనే హెలికాప్టర్ షాట్ ఆడుతూ అదరగొడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి షార్ట్షాట్ ఎవరైనా ఎప్పుడైనా ఆడారు అంటే చాలు అది చూసి ధోని అభిమానులు అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఏ ఆటగాడు ఆడిన ఎందుకో ధోని లాగా హెలికాప్టర్ షాట్ కనిపించడం లేదని కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక బాలిక మాత్రం ఏకంగా ధోని అభిమానులనే హెలికాప్టర్ షాట్ తో ఫిదా చేసేస్తూ ఉంది. అచ్చం ధోని హెలికాప్టర్ షాట్ కొట్టాడేమో అనేంతలో పర్ఫెక్ట్ గా షాట్ ఆడుతుంది ఇక్కడ ఒక బాలిక. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఈ వీడియోను స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో చూసుకుంటే సదరు బాలిక ఫుల్ షాట్లతోపాటు కవర్ డ్రైవ్ లు కూడా ఎంతో అద్భుతంగా ఆడటం చూడవచ్చు. అదే సమయంలో ఇక ధోని తరహాలోనే అద్భుతమైన హెలికాప్టర్ షాట్లు ఆడటం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన రైల్వే మంత్రిని కూడా ఆ బాలిక ఆడిన హెలికాప్టర్ షాట్ బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ బాలిక ఆడిన షాట్లలో నాకు ఫేవరెట్ హెలికాప్టర్ షాట్.. మరి మీకు ఏ షాట్ ఫేవరెట్ అంటూ మంత్రి నేటిజన్స్ కి ఒక ప్రశ్న వేశారు.