క్రికెట్ కి ఉన్న క్రేజ్ ప్రపంచ దేశాల్లో మరింత పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక క్రికెట్ చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. ఇక ఎక్కడ మ్యాచ్ జరిగినా కూడా అటు క్రికెట్ ప్రేక్షకులు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే అటు అటు క్రికెట్లో ఉండే ప్రమాణాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయ్. ఈ క్రమంలోనే ఎంతోమంది క్రికెటర్లు ఎప్పుడూ అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ ఇక ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఇక ఫీల్డర్లు అద్భుతమైన విన్యాసాలు చేసి ప్రేక్షకులను అబ్బురపరచడం ఎన్నో సార్లు చూస్తూ ఉంటాం. పరుగులను కట్టడి చేయడానికి అద్భుతమైన విన్యాసాలు చేసి బంతిని ఆపడం లేదా అసాధ్యం అనుకున్న క్యాచ్ లను పట్టి అదరగొట్టడం ఎన్నోసార్లు ఇప్పటివరకు క్రికెట్లో చూసాం. ఇలాంటిది ఏదైనా జరిగిందంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ కనీ విని ఎరిగి ఉండరు అని చెప్పాలి. దీంతో ఇక ఈ క్యాచ్ పట్టిన తీరు చూసి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.


 యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్ లో భాగంగా జరిగిన ఒక క్వాలిఫైయర్ మ్యాచ్లో ఇలా అద్భుతమైన క్యాచ్ పరీక్షకులందరికీ కూడా ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో సివైఎంఎస్ పై 3 వికెట్ల తేడాతో డ్రిక్స్ హార్స్న్ విజయం సాధించింది. తద్వారా యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్ లో ఫైనల్ లో డ్రిక్స్ హార్న్స్ అడుగుపెట్టింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో సి వై ఎం ఎస్ ఆటగాళ్లు జాసన్ వాన్ డేర్ మెర్వ్, జాకబ్ ముల్దర్ అద్భుతమైన విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తు సంచలన క్యాచ్ తో మెరిసారు అని చెప్పాలి. డ్రిక్స్ హార్న్స్ ఇన్నింగ్స్ నాలుగు ఓవర్ సమయంలో ఆడమ్ కెనాటి బౌలింగ్లో నబి డీప్ మీట్ వికెట్ దిశగా భారీ షాట్ కు ప్రయత్నించాడు.


 షాట్ సరిగా కనెక్ట్ కావడంతో అంత సిక్స్ అని భావించారు.  కానీ అక్కడే అసలు ట్విస్ట్ చోట్ చేసుకుంది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వాండర్ మెర్వ్ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. బౌండరీ రోప్ దగ్గరగా ఉండడంతో బంతిని వాండర్ మెర్వ్ గాల్లోకి వేసాడు. అంతలోనే జాకప్ ముల్ధర్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాష్ ను అందుకున్నాడు. అయితే ఇక బ్యాలెన్స్ కోల్పోవడంతో అతను బంతిని గాల్లోకి ఎగిరేసి.. బౌండరీ లైన్ అవతలికి వెళ్లి మళ్లీ ఇటువైపు వచ్చి క్యాచ్ అందుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: