సాధారణంగా ఐపీఎల్లో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఆడినప్పటికీ అటు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లది మాత్రం ప్రత్యేకమైన పాత్ర. బౌలర్లు బ్యాట్స్మెన్లు అనే తేడా లేకుండా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఎప్పుడూ రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో అటు కొన్ని మ్యాచ్లకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు దూరమయ్యారు. నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఉన్న నేపథ్యంలో ఇక దేశం తరఫున ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇక ఇండియాలో వాలిపోయారు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు.


 ఇక ఇలా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కారణంగా ఐపీఎల్ కు దూరమైన ఆటగాళ్లలో  అటు అన్ రిచ్ నోర్జె  కూడా ఒకరు అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా జట్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఎప్పుడు బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ ప్రత్యర్ధులను వనికిస్తూ ఉంటాడు నోర్జె. అయితే ఈ స్టార్ బౌలర్ అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవలే నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ముగించుకుని ఐపిఎల్ లో చేరాడో లేదో ఇక గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ  ఫాస్ట్ బౌలింగ్ తో మరోసారి నిప్పులు చెరిగాడు. అద్భుతమైన బంతులు సంధిస్తూ ప్రత్యర్ధులను వనికించాడు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.



 ఏకంగా ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా అద్భుతమైన ప్రదర్శన చేసి సూపర్ ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ ను క్లీన్ బౌల్డ్ చేసాడు. 148 కిలోమీటర్ల వేగంతో నోర్జే వేసిన బంతికి గిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది అని చెప్పాలి. ఎలా ఆడాలో తెలియక డిపెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. బంతివేగానికి లెగ్ స్టంప్ ఎగిరి పడింది అని చెప్పాలి. దీంతో గిల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక అంతకు ముందు తొలి ఓవర్ లోనే వృద్ధిమాన్ సాహాను కూడా నోర్జె బౌల్డ్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: