ఐపీఎల్ రెండో వారంలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయడానికి అటు ప్రేక్షకులుఎవరు కూడా ఇష్టపడటం లేదు అని చెప్పాలి. ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా అంతే ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పాలి. చివరి బంతి వరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరికి మూడు పరుగుల స్వల్ప తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది అని చెప్పాలి. ఇప్పటికే వరుస విజయాలు సాధిస్తున్న రాజస్థాన్ మరోసారి చెన్నైతో మ్యాచ్లో తమ జోరును కొనసాగించింది అని చెప్పాలి.


 అయితే చివరి ఓవర్ లో 21 పరుగుల అవసరమైన సమయంలో మహేంద్ర సింగ్ ధోని అప్పటికే రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో అలవోకగా విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. అలాంటి సమయంలో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఎంతో తెలివిగా యార్కర్లు సందించడంతో ఇక అటు పరుగులు చేసే అవకాశం అటు ధోనీకి లేకుండా పోయింది అని చెప్పాలి. దీంతో చివరి ఓవర్లో 18 పరుగులు మాత్రమే ధోని చేయడంతో చివరికి 3 పరుగుల తేడాతో  రాజస్థాన్ విజయం సాధించింది.


 అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయం సాధించాము అని ఆనందం మాత్రం ఎక్కువసేపు లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కు అటు రిపరీ 12 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే తప్పు రెండోసారి జరిగితే సంజూ పై ఒక మ్యాచ్ నిషేధం కూడా పడబోతుంది అని చెప్పాలి. ఈ సీజన్లో మొదటిసారి అటు బెంగళూరు కెప్టెన్ డూప్లెసెస్ ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కట్టాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు సంజు  కి కూడా ఇలాగే జరిమాన పడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl