గత కొంతకాలం నుంచి అటు టీమిండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ దూరమవుతున్నారూ. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ సైతం వరుసగా వెన్నునొప్పి గాయం బారిన పడుతూనే ఉన్నాడు. ఇక ఇటీవల కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చినట్లే కనిపించినా
. ఇక పాత గాయం తిరగబెట్టడంతో చివరికి జట్టుకు మరోసారి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.



 ఇక శ్రేయస్ అయ్యర్  వెన్ను నొప్పి గాయం కారణంగా ప్రస్తుతం ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీకి కూడా అందుబాటులో లేకుండా పోయాడు అని చెప్పాలి. అయితే ఇక వెన్నునొప్పి గాయానికి ఇక శాశ్వత పరిష్కారం చూపాలి అని నిర్ణయించుకున్న శ్రేయస్ అయ్యర్ వైద్యులు సూచన మేరకు సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే సర్జరీ కోసం లండన్ పయనం అయ్యాడు అని చెప్పాలి. ఇకపోతే అయ్యర్ ఫ్యాన్స్ కి  ఒక గుడ్ న్యూస్ అందింది. టీమిండియా యంగ్ ప్లేయర్స్ శ్రేయస్ కు లండన్ లో సర్జరీ విజయవంతంగా పూర్తయిందట.


 ప్రస్తుతం అతను బెడ్ రెస్ట్ తీసుకుని కోలుకుంటున్నాడని.. ఇక మూడు నెలల్లో ఫిట్నెస్ సాధిస్తాడని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఇక జూన్లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి అతను దూరం కాబోతున్నాడు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్ కి మాత్రం జట్టుకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక త్వరలోనే భారత్ కు వచ్చి నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా అతను ఫిట్నెస్ నిరూపించుకోవడంతో పాటు ఫామ్ నిరూపించుకుంటేనే జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl