
ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా అటు సాంప్రదాయమైన టెస్టు క్రికెట్లో విశ్వ విజేతగా నిలవాలని టీమ్ ఇండియా ఎంతగానో ఆశపడుతుంది. అయితే ఇక లండన్ వేదికగా జరిగే డబ్ల్యుటిసి ఫైనల్ కోసం ఇప్పటికే బీసీసీఐ అటు 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ప్రకటించింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ముందు టీం ఇండియాకు ఊహించని షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే భారత జట్టులో ఫాస్ట్ ఫాస్ట్ బౌలర్ గా ఉంటూ డబ్ల్యూటీసి ఫైనల్ కు ఎంపికైన ఉమేష్ యాదవ్ ఇటీవల గాయం బారిన పడ్డాడు.
దీంతో అతను డబ్ల్యూ టి సి ఫైనల్ కు దూరం కాక తప్పదు అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ లో కోల్కతా జట్టు తరఫున ఆడుతున్న ఉమేష్ యాదవ్ ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు. ఇక తర్వాత గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ మధ్యలోనే తప్పుకున్నాడు. అయితే ఇక తర్వాత మ్యాచ్లలో అతను ఆడుతాడా లేదా అనే లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఉమేష్ యాదవ్ గాయ మాత్రం భారత జట్టు మేనేజ్మెంట్ కి శుభవార్త కాదు. ఎందుకంటే ఇక అతను జట్టులో కీలక బౌలర్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పటికే బుమ్రా దూరమయ్యాడు. శ్రేయస్, పంత్ లాంటి కీలక ప్లేయర్లు కూడా ఇక వివిధ కారణాలతో దూరమయ్యారు. ఉమేష్ యాదవ్ కూడా దూరం అయితే అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం టీమిండియా కు పెద్ద తలనొప్పి అని చెప్పాలి..