2023 ఐపీఎల్ సీజన్లో కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న ఎంతోమంది సీనియర్ ప్లేయర్లు అద్భుతంగా రాణించడం చూస్తూ ఉన్నాం. ఇలా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అజింక్య రహనే, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా లాంటి ప్లేయర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చారు అని చెప్పాలి. అయితే ఎవరు ఊహించిన విధంగా మరో సీనియర్ ప్లేయర్ కూడా 2023 ఐపీఎల్ సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు.



 2020 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు కేదార్ జాదవ్. 2021 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బేస్ ప్రైస్ కి అతని జట్టులోకి తీసుకుంది. కానీ అక్కడ కూడా అతను పెద్దగా సాధించింది ఏమీ లేదు. దీంతో వరుసగా రెండు సీజన్లలో కేదార్ జాదవ్ను కొనుగోలు చేసేందుకు ఎవరు ధైర్యం చేయలేదు. ఇక రెండు కోట్ల బేస్ ప్రైస్ తో తన పేరును రిజిస్టర్ చేయించుకున్న కేదార్ జాదవ్ అమ్ముడిపోని ప్లేయర్ గానే మిగిలిపోయాడు. ఇక రెండు కోట్లు అంటే తనకోసం అంత పెట్టెందుకు ఎవరు సిద్ధంగా లేరు అని తెలుసుకున్నాడో ఏమో.. తన బేస్ ప్రైస్ ని ఒక్క కోటికి తగ్గించి.. ఇక ఇటీవలే ఐపిఎల్ లో రిజిస్టర్ చేయించుకున్నాడు.


 అయినప్పటికీ అతన్ని ఏ ఫ్రాంచైజీ  కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదు. దీంతో ఇక 2023 ఐపీఎల్ సీజన్ కోసం మరాఠీ వ్యాఖ్యాతగా మారిపోయాడు కేదార్ జాదవ్. కానీ సడన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఛాన్స్ వచ్చింది. గాయంతో బెంగళూరు జట్టుకు దూరమైన డేవిడ్ మిల్నే ప్లేస్ లో కేదార్ జాదవ్ ఆర్సిబి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక ఆర్సిబి తరపున ఆడుతున్న కొంతమంది బ్యాట్స్మెన్లు విఫలమవుతున్న నేపథ్యంలో కేదార్ జాదవ్ ఆ సమస్యను తీరుస్తాడని ఆశిస్తుంది ఆర్సిబి. నేను కామెంట్రీ చెబుతుంటే సంజయ్ బంగర్ నుంచి కాల్ వచ్చింది. ఎందుకొ అనుకున్నాను. కానీ జట్టులో ఛాన్స్ వస్తుందని ఊహించలేకపోయా.. అంటూ కేదార్ జాదవ్ చెప్పుకొచ్చాడు. వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానిస్తా అంటూ కేదార్ జాదవ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl