ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది నుంచి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఎప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగే ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం తమ సత్తా ఏంటో చూపించలేక పోతుంది. అయితే ఒక మ్యాచ్ లో గెలిచి అద్భుతంగా పుంజుకుంది అనుకుంటున్నప్పటికీ.. ఆ తర్వాత మ్యాచ్లోనే ఘోర ఓటమిని చవిచూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్  ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుందా లేదా అన్నది అనుమానంగానే మారిపోయింది. అయితే అభిమానులు ముంబై ఇండియన్స్ ఆట తీరుతో తీవ్రంగా నిరాశలో మునిగిపోతున్నారు.



 ఇకపోతే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి ముంబై ఇండియన్స్ ఓడిపోయి అభిమానులు అందరిని మరింత తీవ్రంగా నిరాశపరిచింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ పరుగులు ఖాతా తెరవకుండానే డక్ అవుట్ కావడం మాత్రం అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కేవలం ఈ మ్యాచ్ లోనే కాదు గత కొంతకాలం నుంచి కూడా రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇటీవల చెన్నైతో మ్యాచ్లో  డక్ అవుట్ అవ్వడం ద్వారా రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆడిన మూడో బంతికే డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ హిస్టరీ లో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇక అటు రోహిత్ శర్మతో కలిసి దినేష్ కార్తీక్, మన్దీప్ సింగ్, సునీల్ నరైన్ కూడా 15 సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl