ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్ గురించి గత కొంతకాలం నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇంత చర్చ జరగడానికి కారణం అటు ఆసియా కప్ కి పాకిస్తాన్ ఆతిధ్యం ఇస్తూ ఉండడమే. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ఆసియా కప్ పాకిస్తాన్ లో నిర్వహిస్తే తాము ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ కి వెళ్లే ప్రసక్తే లేదని.. కావాలంటే ఈ టోర్ని నుంచి తప్పుకుంటాము అంటూ స్పష్టం చేసింది బీసీసీఐ. అయితే ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న పిసిసిఐ ని ఆసియా కప్ నుంచి పక్కన పెడితే టోర్నీ నిర్వహించిన నష్టాలు తప్పవు అన్నది అందరి భావన.


 ఈ క్రమంలోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఇలాంటి ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ లో నిర్వహించాల్సిన ఆసియా కప్ ను మరో వేదికకు మార్చేందుకు ప్రస్తుతం సన్నహాలు చేస్తూ ఉంది అని చెప్పాలి. శ్రీలంక లేదా యూఏఈ వేదికగా ఇక ఆసియా కప్ నిర్వర్తించాలని భావిస్తుంది ఎసిసి. అయితే దీనికి అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అంగీకరించడం లేదు. కనీసం తొలి రౌండ్ నాలుగు మ్యాచ్లు అయినా పాకిస్తాన్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు విజ్ఞప్తి చేస్తుంది.



 అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని మాత్రం అటు ఆసియా సభ్య దేశాలు తిరస్కరిస్తూ ఉండడం గమనార్హం. అదే సమయంలో ఇక పాకిస్తాన్లో కాకుండా ఇతర వేదికలపై ఆసియాక నిర్వహించేందుకు ఆసియా సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు షాకింగ్ కామెంట్స్ చేసింది. తమ దేశంలో కనీసం నాలుగు మ్యాచ్లు అయినా నిర్వహిస్తేనే తాము ఆసియా కప్ లో ఆడతామని.. లేకపోతే ఏసీసీ నుంచి తప్పుకుంటాము అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మరి దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: