2023 ఐపీఎల్ సీజన్లో ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తుంటే.. అప్పటికే ఐపీఎల్ లో అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ ప్లేయర్స్ మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న వారిలో జట్టు లక్నో తరఫున ఆల్ రౌండర్ అనే ట్యాగ్ తో ఆడుతున్న దీపక్ హుడా ఒకడు అని చెప్పాలి. అతను బౌలింగ్లో బ్యాటింగ్లో ఎక్కడ తన సత్తా ఏంటో చూపించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు లక్నో జట్టు తరఫున 11 మ్యాచులు ఆడిన దీపక్ హుడా  6. 9 సగటుతో కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు.



 ఐపీఎల్ హిస్టరీలో అత్యంత తక్కువ సగటు నమోదు చేసిన ప్లేయర్ గా చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇలాంటి ప్లేయర్కు అటు తుది జట్టలో అవకాశం ఇవ్వడమే గొప్ప. అలాంటిది ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఏకంగా దీపక్ హుడాకు ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాడు లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్య. ఈ నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయాడు. అయితే ఓపెనర్ గా వచ్చి ఐదు పరుగులు మాత్రమే చేసి మరోసారి ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి తన వైఫల్యాన్ని కంటిన్యూ చేశాడు దీపక్ హుడా.



 అయితే కృనాల్ పాండ్య తీసుకున్న నిర్ణయం పై మాత్రం అటు అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. సాధారణంగా ఫామ్ లో లేని దీపక్ హుడాకు అసలు జట్టులో చోటు ఇవ్వడమే వ్యర్థం. అలాంటిది మంచి ఫామ్ లో ఉన్న కైల్ మేయర్స్ లాంటి ఓపెనర్ ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఎంపిక చేసి.. అతని స్థానంలో దీపక్ హుడాను తీసుకువచ్చి ప్రమోషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు ఫాన్స్. అయితే కైల్ మేయర్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్ లలో 360కు పైగా పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.. అయితే ఈ మ్యాచ్ లో లక్నో గెలిచిన కృనాల్ పాండ్య నిర్ణయం మాత్రం అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl