ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని మ్యాచ్లలో కూడా పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా వీక్షిస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపిఎల్ లో సత్తా చాటుతూ రికార్డుల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ipl లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న సమయంలో బ్యాట్స్మెన్ జితేష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అందరిని ఫిదా చేసేసింది అని చెప్పాలి.



 ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు అతను మాత్రం క్రీజులో పాతుకు పోయి ఎంతో నిలకడగా బ్యాటింగ్లో రాణించాడు. ఈ క్రమంలోనే ఇక తక్కువ పరుగులకే ఎక్కువ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పంజాబ్ జట్టుకు ఒక గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో జితేష్ శర్మ కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి. ఏకంగా 44 పరుగులతో జట్టును ఆదుకున్నాడు ఈ యంగ్ బ్యాట్స్మెన్. ఇక ఈ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు కూడా ఉండడం గమనార్హం. అయితే ఈ మూడు సిక్సర్ల  ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు జితేష్ శర్మ.



 ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు జితేష్ శర్మ తన అన్ని ఇన్నింగ్స్ లో కలిపి ఏకంగా 21 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇక మరోవైపు లివింగ్ స్టోన్, ప్రబ్ సిమ్రాన్ సింగ్ 19 సిక్సర్లతో తర్వాత స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. కాగా జితేష్ శర్మ మొత్తం 14 మ్యాచ్ లలో కలిపి 39 పరుగులు చేసి పంజాబ్ జట్టు విజయాలలో కీలక పాత్ర వహించాడు. అంతేకాకుండా పంజాబ్ జట్టు తరుపున మూడో టాప్స్ స్కోరర్ గా కూడా కొనసాగుతున్నాడు జితేష్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl