ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో నేడు చివరి డబుల్ హెడర్ డే. ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్స్ మధ్య కొనసాగుతోంది.ఇక వాంఖడే స్టేడియంలో మొదట టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ని ఎంచుకున్నాడు.వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన SRH 20 ఓవర్లలో 5 వికెట్లకు ఏకంగా 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ ఇంకా వివ్రాంత్ శర్మ ఏకంగా 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.మయాంక్ 83 ఇంకా వివ్రాంత్ 69 పరుగులు చేశారు.ఇక ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వల్  మొత్తం 4 వికెట్లు తీశాడు. ముంబైకి ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అదే సమయంలో, RCB కంటే మెరుగైన రన్ రేట్ కలిగి ఉండాలంటే 11.3 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించాలి.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ టీం నిర్ణీత 20 ఓవర్లకు మొత్తం 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ టీం ముందు 201 పరుగుల టార్గెట్ తో నిలిచింది.ఇక మయాంక్ అగర్వాల్ మొత్తం 83 పరుగులు చేయగా, వివ్రాంత్ శర్మ 69 పరుగులతో చాలా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఆకాష్ మధ్వల్‌ 4 వికెట్లు ఇంకా క్రిస్ జోర్డాన్ 1 వికెట్ తీశాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్ ఇంకా ఉమ్రాన్ మాలిక్ ప్లేయర్లు ఉన్నారు.ఇక ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే..రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్ ప్లేయర్లు వున్నారు.ఇక చూడాలి ముంబై టీం ఈ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ప్లే ఆఫ్స్ కి వెళుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: