ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్ క్వాలిఫయర్-1లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ అనేది జరగనుంది.ఇక మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. లీగ్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో ఈ రెండు జట్లు మొదటిసారి తలపడనున్నాయి.గుజరాత్‌ కి ఇది రెండో సీజన్ మాత్రమే. గతేడాది ఈ టీం ఛాంపియన్‌గా నిలిచినా చెన్నై గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించింది. అయితే CSK టీం మాత్రం ఓవరాల్‌గా 12వ సారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.క్వాలిఫయర్-1లో గెలుపొందిన టీం ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. ఓడిన జట్టుకు అయితే ఫైనల్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాల్సి ఉంటుంది.


ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ టీం విషయానికి వస్తే..ఎంఎస్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతిష్ పతిరణ ఇంకా మహిష్ తీక్షణ ఆడనున్నారు.ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే..అంబటి రాయుడు, మిచెల్ సాంట్నర్, రాజవర్ధన్ హంగర్గేకర్, షేక్ రషీద్ ఇంకా ఆకాష్ సింగ్ ప్లేయర్స్ ఉన్నారు.గుజరాత్ టైటాన్స్ టీం విషయానికి వస్తే..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్/శివం మావి, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, యశ్ దయాల్ ఇంకా అలాగే మహమ్మద్ షమీ ఆడనున్నారు.ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే..విజయ్ శంకర్, దసున్ షనక, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్ ఇంకా అభినవ్ మనోహర్ వంటి ప్లేయర్స్ ఉన్నారు.మరి చూడాలి ఈ రెండు టీం లలో ఈ రోజు ఏ టీం గెలిచి ఫైనల్ కి వెళ్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: